ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గురించి

జననం: 30-జూన్-1935

మహాప్రస్థానం:23-జులై-2002 (వ్యాసపౌర్ణమి నాడు)

కలం పేరు: అనంతం

జననీ - జనకులు: లక్ష్మీదేవమ్మ, సుబ్బయ్యగారలు స్వర్గస్థులు

జన్మస్థలం :తోగుమ్మి, కొవ్వూరు తాలూకా, ప గో జిల్లా.

విద్యాభ్యాసం :  

 1. సంస్కృత పాఠశాలపొడగట్లపల్లితూగోజిల్లా
 2. ఆంధ్రగీర్వాణ విద్యాపీఠం, కొవ్వూరు, ప గో జిల్లా
 3. ప్రభుత్వ బోధనాభ్యసన కళాశాల, రాజమహేంద్రవరం

డిగ్రీలు :భాషా ప్రవీణ, ఎం. (సంస్కృతం), ఎం ఏ (తెలుగు), బి.ఇడి.

బిరుదులు :కవికుల రత్నదీప" శ్రీశ్రీశ్రీ సీతారామయతీంద్రుల వారిచ్చినది. “ఆంధ్రవ్యాస" నరసాపురం శ్రీ వేంకటేశ్వర ధార్మిక కేంద్రం వారిచ్చినది. “వైదికాగమాలంకార" కుర్తాళం పీఠాధిపతులిచ్చినది.

ఉద్యోగాలుః 

 1. 1953-65 ప గో జిల్లా ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులు
 2. 1965 - 68 ఏలూరు సర్ సి. ఆర్. ఆర్. కళాశాల సంస్కృతోపన్యాసకులు
 3. 1968 – 70 విశ్వోదయ కళాశాలాంధ్రశాఖాధ్యక్షులు
 4. 1970 – 90 గుంటూరు డా. కె వి కె సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్
 5. 1990 మార్చి 27 నుండి 1991 ఆగస్టు 31 వరకు గుంటూరు శ్రీ శారదా నికేతనం మహిళా ఓరియంటల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
 6. 1991 సెప్టెంబరు 1 నుండి 1994 జులై 31 వరకు గుంటూరు డా. కె వి కె సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్

అభిరుచులు : సంగీతం, సాహిత్యం, నటనం

ఇతర విశేషాలుః

భద్రాచల సీతారామకళ్యాణ గగనవాణి, దూరదర్శనలకు దాదాపు 30 ఏళ్లపాటు ప్రత్యక్ష వ్యాఖ్యాత.

1973 నుంచీ కొన్నేళ్లు గుంటూరు రచయితల సహకార సంఘం ఉపాధ్యక్షులు.

1979లో పురాణేతిహాసానువాద పరిశోధన ప్రచురణలకు సాధనముగా అనంతసాహితి స్ధాపన, కార్యదర్శిత్వం.

1979 – 83 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యత్వం, సంస్కృత సంబంధి సలహా సంఘ సభ్యత్వం.

నాగార్జున విశ్వవిద్యాలయంలో :

సంస్కృత కళాశాలల తరఫున మొదటి అకడమిక్ కౌన్సిల్ సభ్యత్వం.

1980 నుండి 1993 వరకు డీన్ ఆఫ్ ఓరియంటల్ లెర్నింగ్.

ఈ పదవి కారణంగా సెనేట్ లో, అకడమిక్ కౌన్సిల్ లో , అకడమిక్ సెనేట్ లో సభ్యత్వం.

ఇతరాలు:

1982 -83 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురస్కారం ముఖ్యమంత్రి శ్రీ కె విజయ భాస్కరరెడ్డి నుంచి పొందిన ముగ్గురు ప్రాచ్య కళాశాలోపాధ్యాయులలో ఒకరు.

1983 – 84 పెదముత్తీవి శ్రీ లక్ష్మీపతి స్వామివారి దేవస్థాన గౌరవాస్థాన కవి.

1985 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ హాస్యరస మహాసభలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తరఫున పాల్గొనిన ఆంధ్ర హాస్యరచయితలలో ఒక ప్రతినిధి.

యుజిసి సహాయంతో సంస్కృతాంధ్ర జైమిని భారతాలపై పరిశోధన.

తెలుగు హాస్య రచనకు ఏటా తెలుగు విశ్వవిద్యాలయం ఇచ్చే శ్రీబలుసు బుచ్చి సర్వారాయుడు స్మారక పురస్కారం జంఘాల శాస్ర్తి క్ష్మాలోక యాత్ర రచనకు 1989 శుక్ల సంవత్సరాదినాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యన్. టి. రామారావుచే.

1990 ప్రమోద సంవత్సరాదినాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ మర్రి చెన్నారెడ్డి చే సంస్కృత పండిత సత్కారం.

1990లో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి శతజయంత్యుత్సవ ప్రత్యేక సంచికకూ,

శ్రీ అన్నవరం క్షేత్ర చరిత్రకూ సంపాదకత్వం, రెండవదాని, ఇద్దరు రచయితలలో ఒకరు కూడా.

1995 డిసెంబర్ 15,16,17 తేదీలలో హైదరాబాదులో షష్టిపూర్తి మహోత్సవం.

1996 మార్చి 20 నుంచి సెప్టెంబరు 16 వరకు ఇంగ్లండు, అమెరికాలలో తెలుగువారి ఆహ్వానం పై పర్యటనం, అమెరికాలో అనంతసాహితి శాఖ ఏర్పాటు.


 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం

 • చల్లని మాట

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: 

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

 • కోరికలు

 • సదాచారం

 • ​ప్రజాపాలకుల కర్తవ్యం

​​

ఆకాశవాణి సూక్తిముక్తావళి

 • ప్రారంభం

 • పుట్టిన్రోజే కల్యాణమా?

 • నవవిధరామరూపాలు

 • పెళ్లి నడకలతో కదలిన రాముడు

 • మండప ప్రవేశం

 • తిరువారా​ధనం

 • విష్వక్సేన పూజ

 • పుణ్యా: వాచనం

 • ఒకరికెదురుగా మకొకరు

 • ప్రవరలు

 • యోక్త్ర బంధనం, కంకణధారణం

 • యజ్ఞోపవీతధారణం

 • ఆభరణధారణం

 • వరపూజ- మధుపర్కాలు

 • మహాసంకల్పం 

 • కన్యాదానం

 • మంగళాష్టకములు

 • వేదపఠనం

 • సుముహూర్తం

 • సూత్రధారణం

 • తలబ్రాలు, స్వస్తి

భద్రాద్రి సీతారామ వ్యాఖ్యానక్రమం ఇదే...!

AddThis Sharing
Windows GadgetMore
Hide
Show
Share
Toggle Dock