జానక్యా: కమలామలాంజలి పుటే: యా: పద్మరాగాయితా:

న్యస్తారాఘవ మస్తకేచ విలసత్ కుందప్రసూనాయితా:

స్రస్తా:శ్యామలకాయకాంతికలితా: యా ఇంద్రనీలాయితా:

ముక్తా: సా: శుభదా భవన్తు భవతాం శ్రీరామ వైవాహికా:


శిరస్సునందు ప్రాలు ఉంచడం ఆశీర్వదించడం, శుభకామన తెలియజేయడం వంటిది. ప్రాలు అంటే బియ్యం అని అర్థం.  నా నెత్తిమీద పాలు పోశావు అని సామెత ఉంది. ఈ విధంగా చూసుకున్నా ఇది శుభసూచకమే. తలంబ్రాలు కాదు. అది తలబ్రాలు. వాడుకలో అది తలంబ్రాలు అయింది. తలబ్రాలలో పాలు కలపడం కూడా ఒక ఆచారం ఉంది.


స్వామివారి వైభవానికి మరో గుర్తు ముత్యాల తలబ్రాలు. హైందవేతరుడైన ఒక పాలకుడి నుంచీ స్వామివారికి తలబ్రాలు రావడం స్వామివారి వైభవానికి మరోగుర్తు. అలనాటి ఆచారాన్ని నేటికీ ఆంధ్ర పరిపాలకులు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి తలమీదపెట్టుకుని మరీ స్వామివారికి తలబ్రాలు తీసుకువస్తారు.


స్వామివారి తలబ్రాలను ఒక మహాకవి ఈ విధంగా వర్ణించాడు. తెల్లని ముత్యాలు సీతామ్మవారు చేతిలోకి తీసుకోగానే అవి ఎర్రనైపోయాయిట. ఇవేమిటి రంగుమారిపోయాయి అని అమ్మ అనుకుంటూ స్వామివారి శిరస్సుపై ఉంచగానే అవి స్వామివారి తెల్లని తలపాగావల్ల మల్లెలవలె కనిపించాయట. ఇవేమిటి తెల్లబడిపోయాయి అని అనుకుంటూ ఉండగానే అవి తల నుంచీ జారి స్వామివారి నీలమేఘశ్యాముని మేనిఛాయ కారణంగా నీలంగా మారిపోయాయట. అటువంటి తలబ్రాలు మనందరికీ శుభాలు కలుగ చేయాలని కవి కోరుకున్నారు.


స్వామివారి తలబ్రాలు సర్వశుభాలు కలిగిస్తాయి. వీటిని శిరస్సుపై ధరిస్తే పెళ్లికాని వారికి పెళ్లి అవుతుంది పెళ్లి అయినవారికి పిల్లలు పుడతారు. పిల్లలు ఉన్నవారికి పిల్లలు విద్యావంతులు అవుతారు. విద్యావంతులైన పిల్లలు ఉద్యోగులు అవుతారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వ్యవసాయం లాభదాయకమవుతుంది. సకల శుభాలూ కలగచేసే తలబ్రాల కోసమై ప్రతి ఏడాదీ స్వామి కల్యాణార్చన చేద్దాం. స్వామివారి కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం విన్నవారికి కూడా సకలశుభాలూ కలుగుగాక!!!

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-21

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

తలబ్రాలు, స్వస్తి

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock