ఒక సూత్రం పుట్టింటివారిది. మరొకటి అత్తింటి వారిది. ఇది సాధారణంగా ప్రతీ అమ్మకూ ఆంధ్రదేశంలో ఉంటాయి. కానీ, భద్రాద్రి సీతామ్మవారికి మాత్రం మూడు సూత్రాలుంటాయి.


సూత్రమూలే గౌరీ సూత్ర మధ్యే సరస్వతీ, సూత్రాగ్రే మహాలక్ష్మీ అని మంత్రాలు అంటున్నాయి. అన్నీమాకు తెలియదు ఒకటి జనకమహారాజు చేయించినది. రెండోది దశరథమహారాజు చేయించినది మూడోది మా రామదాసు చేయించినది అని భక్తులు అంటూంటారు.


అందరి వివాహాల్లో మాంగళ్యం తంతునానేన మమజీవనహేతునా, కంఠేబధ్నామి శుభగే త్వంజీవ శరదాం శతం అని మంత్రాలు చదువుతారు. కానీ, జగత్పితరులు కనుక వారికి వేరే మంత్రాలు చదువుతారు. మాంగళ్యం తంతునానేన జగన్మంగళ హేతునా.... అని చదువుతున్నారు.


జగన్మంళసూత్రాలను భక్తులకు చూపిస్తున్నారు. భక్తులు కళ్లకు అద్దుకుంటున్నారు. నాలుగుదిక్కులకూ చూపిస్తున్నారు. స్వామివారి చేతికి సూత్రాలు ఇచ్చారు. స్వామివారు అమ్మమెడలో మూడు ముళ్లూ వేస్తున్నారు. జగత్కల్యాణం కోసం స్వామి మరోసారి అమ్మకు తాళికడుతున్నారు. అర్చక స్వాములు సూత్రములపై అక్షతలు, కుంకుమా ఉంచుతున్నారు.


మంగళవాద్యఘోష మిన్నంటింది. పండిత వేదమంత్రఘోష ఆకాశాన్ని తాకింది. భక్తుల ఉత్సాహం అవధులు దాటింది. స్వామికి కల్యాణం చేయించడంతో లోకానికి శుభం జరుగుతుందని భక్తులు సంతోషంగా ఉన్నారు.


సూత్రధారణ తరువాత తలబ్రాలు పోసుకోనున్నారు, నవవధూవరులు. ఎక్కడైనా నవవధూవరులు అనడం వెటకారంగా ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం సరైన ప్రయోగం. ఎందుకంటే, స్వామి వారికి నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్పవ వార్షికోత్సవాలు జరుగుతాయి. ఇవి కాక, భక్తుల కోరికలపై నిత్యకల్యాణం కూడా జరుగుతుంది. కనుక స్వామివారు ఎప్పుడూ నవవధూవరులే.  


దీని తరువాత తలబ్రాల వేడుక జరుగనుంది.

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-20

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

సూత్రధారణ

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock