ఒక ముహూర్తానికి 48 ఆంగ్ల నిమిషాలు ఉంటాయి. ఒకరోజులో మొత్తం 30 ముహూర్తాలు ఉంటాయి. వీటిలో ఒక మంచి ముహూర్తాన్ని ఎన్నుకుని జీలకర్రా, బెల్లం వధూవరులకు ధరింపచేస్తారు.


వధూవరులు ఒకరి శక్తి మరొకరిలో ప్రవేశపెట్టుకొనడానికి ఈ జీలకర్రా, బెల్లం ఉపయోగిస్తాయి. దీనినే హస్తమస్తక సంయోగం అంటారు. రామకృష్ణ పరమహంస ఇదే విధానంలో వివేకానందుని అనుగ్రహించారట. ఈ విధంగా శక్తిని ప్రసారం చేయడంలో జీలకర్రా, బెల్లం పనిచేస్తుందని పెద్దలు అంటారు.


వివాహంలో సుముహూర్తంమే అతి ముఖ్యమైనది. దీనినే ముహూర్తం ప్రకారం జరుపుతారు. దీని తరువాత సూత్రధారణ చేస్తారు. మానవుల వివాహాల్లో ఈ సమయం వరకూ తెరను అడ్డంగా ఉంచుతారు. జీలకర్రా బెల్లం ఉంచిన తరువాత, తెరలు తొలగించి ఒకరి కళ్లలో ఒకరిని చూడమని చెబుతారు. ఇదే చక్షుసంయోగం అంటారు. సరిగ్గా అనుకున్న ముహూర్తానికి ఒకరి చూపులు మరొకరితో సంయోగం చెందడం జరుగుతుంది.


నారాయణ స్వరూపుడైన శ్రీరామ చంద్రమూర్తి, సీతామహాలక్ష్మి వివాహ ముహూర్తం కోసం లోకాలన్నీ ఎదురు చూస్తున్నాయి. భక్తులు కూడా ఎదురు చూస్తున్నారు. అర్చక స్వాములు కూడా ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు ఈ పెళ్లి అవ్వాలి, రాక్షసవధ జరగాలి. లోకకల్యాణం జరగాలి. కనుక, సుముహూర్తానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  పెద్దలకు జీలకర్రా బెల్లం చూపించారు. వాటిని వారు కళ్లకద్దుకున్నారు.


భక్తులకు జీలకర్రా, బెల్లం ఉండలను చూపిస్తున్నారు. భక్తులు అందరూ వాటికి నమస్కారం చేస్తున్నారు. మంగళవాయిద్యములు మిన్నంటాయి. భక్తులు గోవిందలు కొడుతున్నారు. జయజయధ్వానాలు చేస్తున్నారు. రాముడు తన దక్షిణ హస్తముతో అమ్మ శిరస్సుపై జీలకర్ర మిశ్రమాన్ని ఉంచాడు. అమ్మవారు కూడా ఏకకాలంలో అయ్యవారి శిరస్సుపై జీలకర్రా మిశ్రమాన్ని ఉంచారు. రాముడూ, సీతా మరోసారి ఒకటయ్యారు. ఇదే మంచి ముహూర్తం. ఇంతకు మించినది మరొకటి లేదు.


మిన్నంటిన సంబరాల నడుమ అర్చక స్వాములు మంగళ సూత్ర ధారణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-19

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

సుముహూర్తం

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock