"వేదానాం సామవేదోస్మి" అని తనకు తానుగా తన ఉనికిని చెప్పేసుకున్నాడాయన. స్వామివారు సామగానలోలుడు. అనంతవేదాధ్యయనుడు. అటువంటి స్వామికి వివాహసమయంలో సామగానంతోపాటు మిగిలిన మూడు వేదాలలోని పనసలు చెబుతారు.

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయోభూయోనమామ్యహం


మానవులంతా ఏకవేదం, ద్వివేదం మహా అయితే చతుర్వేదాలూ చదవగలరు. స్వామివారు అనంత వేదాధ్యయనం చేసిన వాడని ప్రవరల్లో చెప్పారు.


స్వామికి నమస్కారం చేస్తేచాలు సంతోషిస్తాడట. ఏడు జన్మల్లో చేసిన పాపాలు కూడా స్వమివారు నాశనం చేస్తారట. రుద్రునికి పూజ చేస్తే సంతోషిస్తాడు, జపహోమాలు చేస్తే ఆదిత్యుడు సంతోషిస్తాడు. శంఖచక్రగదాపాణి మాత్రం కేవలం నమస్కారం చేస్తే చాలు సంతోషిస్తాడట.


ఆపదాం అపహర్తారం, ఆపదలను హరించువాడు, దాతారం సర్వసంపదాం, సర్వసంపదలనూ ఇచ్చువాడు లోకాభిరాముడు శ్రీరాముడు. ఆయనకు అనేక పర్యాయములు నమస్కారాలు చేస్తున్నాను అని శ్లోకం. దీన్నే ఆపదోద్ధారకమంత్రం అని అంటారు.


భగవద్గీతలోని విభూతి యోగంలో స్వామి తన చిరునామాలు చెప్పారు. ఏఏ రూపాల్లో తాను ఉన్నానో చెప్పారు. అందులో స్పష్టంగా వేదాలలో సామవేదం తానేనని తన సామగానలోలత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఎందుకుంటే వేదాలన్నీ అపౌరుషేయాలే. భగవంతుని నుంచీ పుట్టినవే. అయినా వీటిలో కూడా విశేషంగా సామగానానికి స్వామి అగ్రపీఠం వేశారు. అందుకేనేమో, భద్రాద్రిలో సామగానం చేశారు.


సుముహూర్త సమయంలో వేదములు పఠించారు. ద్రవిడవేదాలు పఠించారు. అందరూ అభిజిర్ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. 


ఇక సుముహూర్తానికి సిద్ధం అవుతున్నారు. అంటే జీలకర్రా బెల్లం శిరస్సులపై ఉంచే ప్రక్రియ. వివాహంలో ఇదే ప్రధానమైంది.

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-18

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

వేదపఠనం

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock