కన్యాదాన సమయంలో చేసే దానాలకు విశేష ఫలం ఉంటుందని గోదాన, హిరణ్యదాన, భూదానాలను చేస్తారు. ఈ దానాలు చేసిన తరువాత అభిజిర్ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లోపల మంగళాష్టకాలు, వేదపఠనం, చూర్ణికలు చదవడం చేస్తారు. ఇవన్నీ ముహూర్తానికి ఉన్న సమయాన్ని బట్టీ చదువుతారు.


పవిత్ర నదీ, వృక్ష, యోగులు, నవగ్రహములు, బుషి, పతివ్రతా, దేవతా, పుణ్యక్షేత్ర ప్రశస్తి తెలియచేసే శోకాలు పఠించి వారంతా వధూవరులను అనుగ్రహింతురుకాక అని మంగళాష్టకాలు చదువుతారు. దీని తరువాత చూర్ణికలు చదువుతారు. ఈ చూర్ణికలు గద్యములు. వీటికి ఛందోగంధం ఉంటుంది. ఉన్న సమయాన్ని బట్టీ గద్యహృద్యమైన చూర్ణికలు చదువుతారు.


మంగళాష్టకాలలో శ్రీదేవి, సరస్వతీ, గిరిజా, అహల్యా, మండోదరీ, పాంచాలీ, తారా, అరుంధతీ, కౌసల్యాది సమస్త పుణ్య వనితలూ ఈ వధూవరులను ఆశీర్వదించాలని ఒక మంగళాష్టకం చెబుతోంది.


భాగీరథీ, నర్మదా, కన్యానదీ, గోమతీ,గోదావరీ, గండకీ, కావేరీ మొదలైన నదులు ఈ వధూవరులను ఆశీర్వదించాలని మరో మంగళాష్టకంలో కోరుతున్నారు.


భారతం, భాగవతం, భవిష్యం, వరాహ, బ్రహ్మ, విష్ణు, వామన, నారదీయ, బ్రహ్మాండం, కూర్మ, మార్కండేయ, మత్స్యాది అష్టాదశమహాపురాణాలు, ఇతిహాసాలు ఈ వధూవరులను ఆశీర్వదించాలని కోరుతున్నారు.


నవగ్రహాలు, నక్షత్రాలు, దేవేంద్రాది దేవగణాలు వధూవరులను ఆశీర్వదించాలని కోరుతున్నారు.


కాంభోజ, కళింగ, వంగ, మగధ, కాశ్మీర, భోజ, నేపాళ, కోసల, సౌరాష్ట్ర మొదలైన దేశాల వనితలు వధూవరులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. మందారాది సర్వ కల్పవృక్షాలు, చింతామణులు, కామధేనువులు వధూవరులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. భక్తులు సుముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు.


ఇక సుముహూర్తానికి సిద్ధం అవుతున్నారు. అంటే జీలకర్రా బెల్లం శిరస్సులపై ఉంచే ప్రక్రియ. వివాహంలో ఇదే ప్రధానమైంది.

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-17

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

మంగళాష్టకాలు

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock