"ఇయం సీతా మమసుతా సహధర్మచరీతవ, ప్రతీచ్ఛ చైనం భద్రంతే, పాణిం గృహ్ణీశ్వ పాణినా, పతివ్రతా మహాభాగా ఛాయ ఇవ అనుగతా సదా" ఈమె సీత, నా పుత్రిక, నీకు ధర్మాచరణలో సహచరి అవుతుంది, నీకు భద్రం కలుగుగాక, ఆమె చేయి పట్టి పాణీగ్రహణం చెయ్యి. ఈమె మహాపతివ్రత మహాభాగా, ఎటువంటి పరిస్థితిలో నైనా నిన్నుఎల్లప్పుడూ నీడలాగా అనుసరిస్తుంది.


పిల్లనిచ్చే సమయంలో భూమి మీద ఎక్కడ ఉన్నాం, ఏ సమయంలో ఉన్నామో చెబుతారు. (టైం, స్పేస్) ఈ విధంగా కన్యాదానం చేయడం వల్ల ఆమె తండ్రి వైపు పది తరాలు, తల్లి వైపు పదితరాల వాళ్లు శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతారని అంటారు. రామాయణంలో జనక మహారాజు ఇయం సీతా.... అంటూ సీతాదేవిని ఇచ్చి రామునికి కన్యాదానం చేశాడు. రామనామమే శిరోధార్యం కనుక నేటికీ పెళ్లిలో ఈ శ్లోకాలను చదువుతూ కన్యాదానం చేస్తారు. విశేషం ఏమిటంటే లక్ష్మీనారాయణాయ స్వరూపాయ వరాయ అంటూ ఎవరికి పిల్లనిస్తున్నా లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి వరునకు కన్యాదానం చేస్తాం. కానీ, ఇక్కడ సాక్షాత్తూ లక్ష్మీనారాయణునికే సీతామహాలక్ష్మీదేవిని దానం చేస్తున్నాం. ఇది ఆంధ్రులకే సొంతమైన మహాపుణ్యం.


కన్యాదానం చేసేటప్పుడు సాలంకృత కన్యాదానం చేయాలని చెబుతారు. సంకల్పంలో కూడా సాలంకృత కన్యాదానం కరిష్యే అని అంటారు. కన్యతోపాటుగా బంగారం కూడా దానం చేస్తే విశేషఫలదాయం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కారణం చేతనే వివాహంలో బంగారానికి అధిక ప్రాముఖ్యత ఏర్పడింది. కనుకనే ప్రపంచంలో ఎక్కడాలేనంతగా బంగారం ప్రియం అయింది.


కన్యాం కనకసంపన్నాం.... అనే మంత్రాలు చదువుతారు. భూమి మీద నుంచీ చంద్ర మండలం వరకూ యవధాన్యమును రాసిగా పోసి, ఒక్కో యవ గింజనూ ఒక్కో ఏడాది తీసివేస్తూ ఉంటే ఆ రాసి ఎన్నాళ్లకు తరుగుతుందో అంతకాలంపాటు బ్రహ్మలోకంలో ఉంటారని ఆర్యోక్తి. ఇదే విధంగా నువ్వులు లేదా ఇసుక రేణువులు పోగుచేసి కూడా లెక్కించవచ్చని కూడా చెబుతారు. కన్యాదానానికి ఇంతటి సుకృతం ఉంది.


అచ్యుత గోత్రంలో పుట్టిన శ్రీరామచంద్ర శర్మకు సౌభాగ్యవతీ గోత్రంలో పుట్టిన శ్రీసీతామహాలక్ష్మిని దానం చేస్తున్నాము అని చెబుతారు. దీనితో కన్యాదానం పూర్తి అవుతుంది. ఇక సుముహూర్తానికి వేళ అవుతోంది. 

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-16

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

కన్యాదానం

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock