మహాసంకల్పం అంటే ఏమిటి? ఇది ఎప్పుడు చేస్తారు? దీని విశేషం ఏమిటి?


కన్యాదాన సమయంలో చేసే సంకల్పం ఇది. మహా పుణ్యదాయకమైనవాటినన్నిటినీ ఈ సమయంలో స్మరిస్తారు. సమస్తసృష్టిలో భూమి, భూమిలో జంబూద్వీపం (తాటికాయలంత ఉండే నేరేడు పళ్ల దేశం) అని పిలిచిన భారతదేశ విశేషం, భారతదేశంలోని పుణ్య తీర్థములు, నదులు, అరణ్యములు, గిరులకు ఉన్న విశేషం చెప్పి దండకారణ్యం, దండకారణ్యంలో భద్రాచలం, భద్రాచలంలో కల్యాణ మండపం అందులో సీతా దేవిని నీకు ఇచ్చి కన్యాదానం చేస్తున్నాము అని సంకల్పంలో ఉంటుంది. ఇంత వివరంగా చిరునామా చెప్పడం నేటి అధునాతన న్యాయశాస్త్ర నిపుణులకు కూడా సాధ్యం కాదేమో?


అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాలకు పైభాగంలో, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలకు క్రింద ఉన్న భూమండలంఅని చెప్పారు. దండకారణ్య, చంపకారణ్య, బదరికారణ్య, దేవికారణ్య, కామికారణ్య, కదలికారణ్య, నైమిశారణ్య, నౌషారణ్య, జంబుకారణ్య, సహ్యారణ్యం అనే పది మహారణ్యాలలో దండకారణ్యంలో ఉన్నాం అని చెబుతారు. అయోధ్యా, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతికా, ద్వారకా మహాపురాలను స్మరిస్తారు. కాళిందీ,, నర్మదా, గోదావరీ, గండకీ, కృష్ణవేణీ, తుంగభద్రా, కావేరీ, కనకావతీ, చంద్రభాగా, పినాకినీ, యమునా మొదలైన పుణ్యనదులను స్మరిస్తారు. పాంచాల, అంగ, వంగ కళింగ కాశ్మీర, కాంభోజ, కాంథార, మగధ, మద్ర నేపాళ, చోళ, గౌళ, మలయాళ, సింహళ, ద్రవిడ, ద్రావిడ, కర్ణాట, విరాట, దాశార్ణవ, బాహ్లిక, శూరసేన, భోజ, బర్బర, కేకయ, కోసల,కౌళిక, కుంతల, సౌరాష్ట్ర, మహారాష్ట్ర దేశాలను (జాబితా సరి చూడవలసి ఉంది) స్మరిస్తారు. ఈ విధంగా సంకల్పంలో చెప్పే వాటి వివరాలు తెలుసుకుంటే ఆరోజుల్లో భౌగోళంపై ఎంత పట్టుఉందో అర్థం అవుతుంది.


ఇప్పటి వరకూ ఎన్ని యుగాలు గడిచాయి? ఎన్ని మహాయుగాలు గడిచాయి? ఎన్ని మన్వంతరాలు గడిచాయి? ఏ శకంలో ఉన్నాము? ప్రభవాది ఏ సంవత్సరంలో ఉన్నామో చెబుతూ శ్రీరామ నవమి తిథి వార నక్షత్రం, ముహుర్తం కూడా చెబుతారు. నోటి మాటలతో ఇంతటి కాల గణనాన్ని సృష్టి ఆది నుంచీ చెప్పడం బహుశా ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం ఉండనవసరం లేదు. .

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-15

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

మహాసంకల్పం

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock