మరచుటలేదు నీ స్మరణ, మాకితరేఛ్చ మరేమిలేదు, కాపురమును నమ్మలేదు, జలబుద్బుద సంపద కోరలేదు, నీ చరణములాన దరిశన విచారమె మాత్రముగాని, ఇంక ఏ అరమర లేదు, భవదంఘ్రుల జూపగదే మహప్రభో.. మహప్రభో


మధుపర్కో మధుపర్కో మధుపర్క: తేనె, పెరుగు మొదలగు వస్తువులతో తయారు చేసిన బలవర్ధకమైన తాపోపశమని. దీనిని రాములవారు సేవించడానికి ఇస్తారు. సువర్ణపాత్రలో దీన్ని నివేదిస్తున్నారు. మధుపర్కాలు అంటే బట్టలు పెట్టడం కాదు. దీని అనంతరం క్షీరాబ్ది పట్టువస్త్రాలు సమర్పిస్తారు కనుక మధుపర్కాలు అంటే బట్టలు పెట్టడం అని పొరబడుతున్నారు.


స్వామి వారికి వరపూజ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ స్వామివారికి వివిధ ఆభరణాలు సమర్పించారు. వీటిలో పచ్చలపతకం, చింతాకుపతకం ఉన్నాయి. ఇవి కాక రామమాడలున్నాయి.. వీటి సమర్పణ అనంతరం స్వామివారికి మధుపర్కాలు ఇస్తున్నారు. మధుపర్కాలు భక్ష్యచోష్య సంబంధమైనది. దీన్ని గోధుములు, నెయ్యి, దధి, శక్ర, గుడ, మధు మిశ్రమంతో తయారు చేస్తారు. ఎండాకాలం వేడి చేయకుండా, నీరసం రాకుండా చేసే బలవర్ధక పదార్ధాలతో దీన్ని తయారు చేస్తారు. సువర్ణపాత్రలో ఉంచిన దీన్ని స్వామివారికి నివేదిస్తారు.


సాధారణంగా మధుపర్కాలు అంటే బట్టలు అని అనుకుంటారు. ఇది నిజం కాదు. వేద సహితమైన మంత్రాలతో వరునికి బలం కోసం సమర్పించే భుజింపదగిన పదార్ధం. మధుపర్కం అయిన తరువాత నూతన వస్త్రాలు పెడతారు కనుక, వీటినే మధుపర్కాలు అని పొరపడుతూ వచ్చారు. వధువుకూ, వరునకూ కూడా బట్టలు పెడతారు. అది వేరే సంగతి. మధువర్కాల సందర్భంలో పెట్టే బట్టలు కనుక వాటికి ఆ పేరు వచ్చింది. అంతేకానీ మధుపర్కాలకూ, బట్టలకూ ఎటువంటి సంబంధం లేదు. మధుపర్క సమర్పణం అనంతరం సుగంధ ద్రవ్యములను, బుక్కా వంటి రంగులనూ భక్తుల మీద జల్లుతున్నారు.


మహాసంకల్పానికి వేళ అవుతోంది.

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-14

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

వరపూజ - మధుపర్కాలు

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock