అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఝరీ

విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ ద్గగనధునీమరంద పద కంజవిశేష, మణిప్రభా ధగ

ద్ధగిత విభూష, భద్రగిరి! దాశరథీ కరుణాపయోనిధీ!


ధగధగా వెలిగిపోతున్న మణులున్న దివ్యాభరణ భూషితుడు, అష్టైశ్వర్యమహా లక్ష్మీపతి ఆయన. పీతాంబరాలు కట్టుకుని శేషపాన్పుపై పవళించే స్వామివారికి రామదాసు చేయించిన ఆభరణాలు స్వాములు అలంకరించ బోతున్నారు.


దానికి పదివేల వరహాలు పట్టాయట. భరతునకూ చేయిస్తి పచ్చల పతకము, దానికి పదివేల వరహాలు పట్టాయి అన్నాడు. శత్రుఘ్నుని మొలత్రాటికి మొహరీలు పదివేలు పట్టాయన్నాడు. లక్ష్మణుని ముత్యాల పతకానికి పదివేల వరహాలు పట్టాయట. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము అని రామదాసు అన్నాడు. ఆ పతకానికి పదివేల వరహాలు పట్టాయట.


రామునికి కలికీతురాయి మెలకువగా చేయించాడట,  నీకు ఇన్నీ నేను చేయిస్తే నన్ను నువ్వు గాక మరెవరు రక్షిస్తారయ్యా? అన్నాడు రామదాసు.


నిన్ను నేను కానివేం కోరుతున్నానయ్యా? పదివేళ్లకూ రత్నపుటుంగరాలు అడిగానా? మణిమకుటాలు అడిగానా? భక్తులందరినీ పరిపాలించే రామయ్యా క్షేమముగా ఈ రామదాసును ఏలవయ్యా? కొరడాలిచ్చుకుని కొడుతున్నారయ్యా. ఈ దెబ్బలకు తాళలేపోతున్నాను అని వేడుకున్నాడట.

దీంతో రాముడు, లక్ష్మణుడూ కదలివచ్చి తానీషాకు మొహరీలు చెల్లించి రామదాసును చెరనుంచీ విడిపించారట. ఆ మొహరీలలోని రెండు మాడలు స్వామివారికి నేడు కూడా ఆభరణాల రూపంలో ధరింప చేస్తున్నారు. ఈ ఆభరణాలు స్వామివారికి నేడు మాత్రమే ధరింప చేస్తారు.


వరపూజలో భాగంగా ఈ దివ్యాభరణాలు స్వామికి సమర్పించారు.  

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-13

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

ఆభరణధారణ

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock