శ్రీరామచంద్రశర్మ ఇప్పటి వరకూ ఒంటి పోచవాడే. సీతమ్మను కట్టుకున్నతరువాతే గృహస్థాశ్రమ అర్హత వస్తోంది. జనక మహారాజు రామస్వామివారికి యజ్ఞోపవీతం సమర్పిస్తున్నారు. దశరథుడు ఒక్క పోచను మాత్రమే ఇవ్వగా, జనక మహారాజు రెండు సమర్పించాడు. ఉత్తర జంధ్యాలు అని సామాన్యులకు వెండి జంధ్యాలు వేస్తారు. చక్రవర్తి కుమారుడు కనుక స్వామివారికి బంగారు జంధ్యములు కూడా సమర్పించారు.


అమ్మవారికి యోక్త్ర బంధనం అయిన తరువాత అయ్యవారికి యజ్ఞోపవీతం సమర్పించనున్నారు. ఇందుకోసం యజ్క్షోపవీతానికి పూజ చేస్తున్నారు. నాలుగు ఆశ్రమాలలో ద్వితీయం అయినది గృహస్థాశ్రమం. బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు మొత్తం నాలుగు. వీటిలో ఇప్పటి వరకూ స్వామి బ్రహ్మచర్యంలో ఉన్నారు. నేటి నుంచీ ఆయన గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాల్సి ఉంది. దీనికి అర్హత కల్పంచేది ద్వితీయ యజ్ఞోపవీతం.


యజ్ఞోపవీత అధిదైవానికి పూజచేసి, నీరాజనం ఇస్తున్నారు. ఆ నీరాజనాన్ని భక్తులకు చూపిస్తున్నారు. అక్షిరోగనాశనకారి అయిన నీరాజనాన్ని భక్తిపూర్వకంగా భక్తులు కళ్లకు అద్దుకుంటున్నారు. ఘంటానాదం, శంఖనాదం చేశారు. యజ్ఞోపవీతం భక్తులకు చూపిస్తున్నారు. స్వామివారి యజ్ఞోపవీతాన్ని భక్తులు కళ్లకద్దుకుంటున్నారు.


యజ్ఞోపవీతం పరమం పవిత్రం, ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్, ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచశుభ్రం, యజ్ఞోపవీతం బలమస్తు తేజ: అంటూ స్వామి వారికి ద్వితీయ యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. సామాన్యులు ఉత్తర జంధ్యాలు అంటూ వెండి జంధ్యాలకు ఎక్కడో ఒక బంగారుపోగు ఉంచి అల్లుడు మొడలో వేస్తారు. చక్రవర్తి కుమారుడికి పిల్లనిస్తున్న మరో చక్రవర్తి అచ్చం బంగారు జంధ్యాలు వేస్తున్నాడు. మొత్తానికి స్వామివారు బ్రహ్మచర్య ఆశ్రమం నుంచీ గృహస్థాశ్రమానికి ప్రవేశించినట్లే.


కన్యాదాన సమయంలో స్వామివారి కాళ్లుకడగడానికి కన్యాదాతలు సిద్ధం అవుతున్నారు. వయసులో పెద్దవారైన మామగారు చిన్నవాడైన అల్లుడి కాళ్లు కడగడం ఏమిటి? అనే సందేహం అందరికీ వస్తూ ఉంటుంది. అల్లుడిని నారాయణ స్వరూపంగా భావించి ప్రతి మామగారూ కాళ్లు కడుగుతారు. జనకుని అదృష్టం సాక్షాత్తూ లక్ష్మీనారాణుడి కాళ్లు కడుగుతున్నాడు.

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-12

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

యజ్ఞోపవీతధారణం - కాళ్లు కడగడం

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock