దేవదేవుని వివాహానికి కూడా ప్రతిసరములు అవసరమే. స్వామి మానవ జన్మ ఎత్తాడు కనుక మానవునిగానే ప్రవర్తిస్తున్నాడు. అమ్మవారు కూడా సామాన్య వనితలాగే ఉంది. అందుకే అమ్మవారికి యోక్త్ర బంధనం చేస్తున్నారు. దీని తరువాత కంకణ ధారణం చేస్తున్నారు.


ప్రతీ వధువుకూ వివాహానికి పూర్వం యోక్త్ర బంధనం చేస్తారు. ఇది దర్భలతో చేసిన తాడువంటిది. ఇది 24 అంగుళాల పొడవు ఉంటుంది. దీన్ని నడుముకు కడతారు. ఉల్ముఖుడు అనే రాక్షసుని పీడ నివారణార్థం దీన్నికడతారు. దీని తరువాత కంకణ ధారణ ఉంటుంది. కంకణములు వధూవరులకు ధరింపచేస్తారు. కంకణములకు సుదర్శనస్వామి అధిదైవముగా ఉంటారు. కం బ్రహ్మాణం కణయతీతి కంకణం. విష్వక్సేన పూజ, విఘ్నేశ్వర పూజ, యోక్త్ర బంధనం, కంకణధరణం మొదలైనవన్నీ ఒకే తరగతికిచెందినవి. ఇవి రెండూ కూడా రాక్షస, విఘ్ననివారణకు ఉద్దేశించినవే.


మానవుడిగా అవతారం ఎత్తిన తరువాత మానవమాత్రుడిగా రాముడు ప్రవర్తించాడు. కానీ, శ్రీకృష్ణుని అవతారంలో మాత్రం పరమాత్మతత్వాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. అంతేకాదు, అవజానంతి మాం మూఢా: మానుషీం తను మాశ్రితం! అన్నాడు గీతాకారుడు. మూఢులు నన్ను ఎరుగరు. రాముడు మాత్రం తన లీలలు బయట పెట్టలేదు. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకు పోతే, సాధారణ మానవుడిలా విలపించాడు. చెట్టూ, పుట్టా, గట్టూ గాలించాడు. అందుకే స్వామివారు సాధారణ మానవుడి మాదిరిగా రక్షణ ప్రతిసరములు ధరిస్తున్నాడు. ఆయన ఆ పని చేయకపోతే, మానవులు మానివేసే ప్రమాదం ఉంది కనుక, మానవ జన్మకు అనుగుణంగా స్వామి ప్రవర్తిస్తున్నాడు


కరుణాంతరంగుడు రాముడు. ఆయనకు తగిన భార్య సీతమ్మ. భక్తులను, ఆర్తులను ఆదుకోవడంలో ఇద్దరిదీ అనుకూల దాంపత్యం.  


సీతా దేవి లేకుంటే రామునికి పూర్ణత్వం రాదు. అయ్యవారిది మహారాజు అనుగ్రహం. సీతాదేవిది కేవలం అమ్మవంటి అనుగ్రహం. నా కాళ్లు పట్టుకుంటే, నన్ను శరణువేడితే అభయం ఇస్తాను అని రాముడు రెండు షరతులు పెట్టాడు. భక్తులను ఆదుకోవడంలో సీతాదేవి మరో రెండు అడుగులు ముందుకు వేసి తప్పులు చేయనివాడు  ఎవడుంటాడు? అని అమ్మ ప్రశ్నించింది. 


 మనిషి (గుహుడుశబరి), పశువు (జాంబవంతుడు), రాక్షసుడు (విభీషణుడు), పక్షి (జటాయువు), వానరుడా (సుగ్రీవుడుఅనేది చూడకుండా ప్రతి ప్రాణికీ అభయం ఇస్తాను అన్నాడు రాముడు. అదే విధంగా చేశాడు కూడా. 

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-11

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

యోక్త్ర - కంకణ ధారణ

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock