శ్రీరాముని గోత్రం ఏమిటి? అమ్మవారి గోత్రం ఏమిటి? భద్రాచల రాముని తండ్రి ఎవరు? దశరథుడు కాడా? ఇవి భక్తులు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు. స్వామివారి అవతార తత్వం తెలిపే ముఖ్యవిషయాలు. పెళ్లికూతురూ, పెళ్లి కొడుకు ప్రవరలు వినడం వలన ఆధ్యాత్మవిషయాలు ఎన్నో తెలుస్తాయి.


ప్రతీ ఒక్కరి పెళ్లిలోనూ తండ్రి, తాత, ముత్తాతల పేర్లు చెబుతారు. ఇక్కడ కూడా రామభద్రుని తండ్రి, తాత, ముత్తాత పేర్లు చెబుతున్నారు. భద్రాద్రి రాములవారి గోత్రం అచ్యుత గోత్రం. శ్రీవత్సస గోత్రీకుల మాదిరిగా స్వామివారిది పంచార్షేం. అనంత వేదాధ్యాయిని. ఆదినారాయణుడు. విభవ అంతర్యామి. ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవలసింది, భద్రాద్రి రాముని దశరథుని కుమారుడిగా కాదు. ఈయన పరబ్రహ్మము యొక్క మునిమనువడు. వ్యూహనారాయణుడి మనువడు. విభవ వాసుదేవుని పుత్రుడు. పెళ్లికొడుకు పేరు శ్రీరామచంద్రశర్మ. ఆయనకు సీతాదేవిని ఇచ్చి వివాహం జరుపుతున్నారు. నేటికీ పల్లెల్లో పెద్దలు ఇదే ప్రశ్నవేస్తారు. మా అమ్మాయి పెళ్లి అంటే అలాగా.... ఎవరి అబ్బాయిని ఇస్తున్నారు? అని ఠక్కున ప్రశ్నిస్తారు. ఇంకొందరు పద్ధతి తెలిసినవారయితే, ఫలానా వారి అబ్బాయితో మా అమ్మాయికి వివాహం అని చెబుతారు.


ఇక పెళ్లి కూతురు విషయానికి వస్తే ఆమెది త్రయార్షేయం. నిరాకారసాకారసౌభాగ్య గోత్రం. చతుర్వేదాధ్యాయిని. సౌభాగ్యవిశ్వంభరి. విశ్వంభర శర్మ మునిమనుమరాలు, రత్నాకరశర్మ మనుమరాలు క్షీరార్నవ శర్మ పుత్రిక. ఆమె పేరు శ్రీసీతా మహాలక్ష్మీ.


అంతా బాగానే ఉంది కానీ, ఎప్పుడు పుట్టాడో తెలియని వాడికి తండ్రి, తాత, ముత్తాత ఎలా వచ్చారు? ఇదే అసలు కీలకం. ఈ చర్చ రావాలనే అన్నట్లు భద్రాద్రి రాముడి ప్రవర ఆధ్యాత్మమణి దీపమైంది. అమ్మ అయితే పాలకడలిలో పుట్టింది అని అందరికీ తెలుసు. అయ్యవారి గోత్రంలోనే అసలు రహస్యం ఉంది. మామూలు రఘువంశమే అయితే ఒక కావ్యమే ఉంది రాముల వారి ప్రవర చెప్పుకోవడానికి. కేవలం భద్రాచలంలోనే స్వామివారి గోత్రనామాలకు మహావ్యాఖ్యానం అవసరం అవుతుంది.నారాయణుడు దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం ఏఏ అవతారాలు ఎత్తినా స్వామికి పరిపూర్ణత్వం కలుగచేయడానికి అమ్మ కూడా అవతరించారు. రాముడికి సీత, కృష్ణుడికి రుక్మిణిగా అవతరించింది. అమ్మ పక్కనే లేకుంటే. స్వామి పరిపూర్ణుడు కాడు. కనుకనే అలనాటి మహర్షుల నుంచీ మన రామదాసు వరకూ ఎంతో మంది అమ్మసహితస్వామిని అనేక విధాలుగా వర్ణించారు. 

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-10

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

ప్రవరలు

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock