ఇప్పటి వరకూ సీతామాతగా రామచంద్రమూర్తి పక్కనే ఆ తల్లి ఉన్నది. ఇప్పుడు పెళ్లి కూతురుగా స్వామివారికి అభిముఖంగా కూర్చొనబోతోంది. అసలు వివాహప్రక్రియ ప్రారంభం కాబోతోంది. స్వామివారి, అమ్మవారి గుణగణవంశవివరాలు తెలిపే ప్రవరలు చెప్పబోతున్నారు.


ఆలయం నుంచీ వచ్చిన అయ్యవారూ, అమ్మవారూ ఇప్పటి వరకూ పక్కపక్కనే ఉన్నారు. వివాహం జరిపించాలంటే మరి ఒకరికెదురుగా మరొకరు కూర్చొని ఉండాలి కదా? అదే చేస్తున్నారు, అర్చకస్వాములు. అమ్మవారిని రామయ్యకు అభిముఖంగా కూర్చోబెట్టడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తెర తొలగించారు. అమ్మవారిని అర్చించే అర్చకస్వామి సీతాదేవిని అందరికీ చూపిస్తున్నారు. ఇది సాధారణ పెళ్లిళ్లలో పెళ్లికూతురును బుట్టలో పెట్టి తీసుకురావడంతో సమానం. సరిగ్గా అలాగే, సీతాదేవిని ఉత్తర, తూర్పు, దక్షిణ, పడమర దిశలలోని భక్తులకు కన్నుల కరువుతీరగా చూపించి స్వామివారి అభిముఖంగా కూర్చోబెడుతున్నారు. భక్తులు జయజయధ్వానాలు చేస్తున్నారు. అయ్యవార్లు మంత్రాలు చదువుతున్నారు. సీతాదేవిని స్వామివారికి ఎదురుగా కూర్చోబెట్టారు.


అమ్మవారికి పుష్పాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి అలంకారాలు సరిచేస్తున్నారు. అందరికీ కనిపించేలా మల్లెపూల జడనూ, బంగారు చేమంతుల జడనూ సరిచేస్తున్నారు. భక్తులు సమర్పించిన పుష్పామాలల్లో అమ్మవారు సిగ్గుల మొగ్గలా ఉన్నారు. నేడు భద్రాద్రి భూమండలంలోని పుష్పాలన్నీ సీతాదేవి చెంతకే చేరాయనిపిస్తోంది. స్వామి వారికి ఎదురుగా ఉన్న రజత సింహాసనంపై కూర్చుని ఉంది. తెల్లని వెండి సింహాసనం మీద సీతాదేవి ధరించిన పట్టుచీర, కనకాంబరాలు, మల్లెమాలూ, వివిధ రత్నాభరాణాలు కలగలిసి అమ్మవారికి వినూత్న శోభ తీసుకువస్తున్నాయి.


కన్యావరణాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అయ్య, అమ్మవార్ల గోత్రనామాలూ, వంశ మూలపురుషులనూ స్మరిస్తారు. ఆది మధ్యాంత రహితుడైన స్వామివారు మానవుడుగా అవతారమెత్తారు. ఒక సామాన్య మానవుడుగా జన్మించాడు కనుక, స్వామివారికి గ్రోత్ర నామాలు ఏర్పడతాయి. అయితే ఆయన అవతార పరిసమాప్తి తరువాత వైకుంఠం నుంచీ వచ్చిన నారాయణుడయ్యే. కనుక స్వామివారికి ఏవిధమైన గోత్రనామాలు చెబుతారు? అని భక్తులు కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.అదిగో అర్చకస్వాములు స్వామివారి, అమ్మవారి ప్రవరలు చెబుతున్నారు.  

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-09

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

ఒకరికెదురుగా మరొకరు

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock