పుణ్యా:వాచనం జరుగుతోంది. వైదికక్రియ ప్రారంభించేముందు పుణ్యా: వాచనం జరపడం ఆచారం. స్థల, ద్రవ్య, అర్చకాదుల శుద్ధి చేయడమే పుణ్యా: వాచనం లక్ష్యం. కర్మణ:పుణ్యా:వాచనం చేయిస్తున్నారు


రాముని అర్చించే విధానంలో కల్యాణం ఒకటి. సామాన్యులకే కాదు, దైవాలకు కూడా కల్యాణం అంటే విశేషంగా సంతోషం కలుగుతుంది. కనుక స్వామి ఆనందం కోసం కల్యాణం జరిపిస్తారు. స్వామి సంతోషిస్తే దేవతలందరూ సంతోషించినట్లే. ఆయన వాసుదేవ స్వరూపుడు. పరతత్వ స్వరూపుడు. వైకుంఠ స్వరూపుడు. ఆనంద స్వరూపుడు స్వామికి ఆనందం కలిగితే జగతికి ఆనందం కలుగుతుంది. జగత్కల్యాణ హేతువవుతుంది. ఎవరికి కల్యాణం జరిగితే వారికి మాత్రమే సంతోషం కలుగుతుంది. స్వామికి కల్యాణం జరిగితే లోకాలన్నీ సంతోషిస్తాయి.


స్వామి వాసుదేవ స్వరూపుడు. సమస్తమూ ఆయనలో ఉంది. సమస్తము నందూ ఆయన ఉన్నాడు. ఆయన స్వయం ప్రకాశుడు. పరతత్వ స్వరూపం వైకుంఠ నారాయణ స్వరూపం. సర్వం పవిత్రం కావడానికి పుణ్యా: వాచనం చేస్తారు. ద్రవ్యాలు రకరకాల హస్తాలతో తెస్తారు. అవి పవిత్రం కావడానికి పుణ్యా: వాచనం కావాలి. కనుక సమస్త ద్రవ్యాలనూ శుద్ధి చేస్తున్నారు


వేద మంత్రాలతో, పవిత్ర జలాలతో శుద్ధి చేస్తున్నారు. కలశపూజ చేస్తున్నారు. అందులో పవిత్ర జాలన్ని ఉంచి దేవతలను ఆహ్వానిస్తున్నారు. అనేక పద్మ, గరుడ ముద్రాది పలు ముద్రలు ప్రదర్శించారు. దీపాన్ని చూపించారు. ధూపాన్నివేశారు. ఈ విధంగా కలశారాధనం జరుగుతోంది. దర్భలను వినియోగిస్తున్నారు. మహారాజుకు, బ్రహ్మాండ నాయకునికీ సమర్పించే ద్రవ్యాలు ఎంతటి శుద్ధిపొందాలో దీని ద్వారా తెలుస్తుంది. స్వామి వారికి సమర్పించే ప్రతీదీ ఉచ్ఛిష్ట రహితంగా, అపవిత్ర రహితంగా ఉండాలి. కనుక ఈ విధమైన శుద్ది కార్యక్రమం జరుగుతోంది.


పుణ్యా:వాచన కార్యక్రమం చూస్తుంటే అందరికీ గుర్తుకు వచ్చేవారు ఇద్దరే. ఒకరు అలనాటి శబరి. మరొకరు దమ్మక్క. శబరి తల్లి అడవిలో దొరికే అనేక ద్రవ్యాలు పండు ముసలి వయసులో సేకరించి స్వామి వారికి నివేదించడానికి సిద్ధంచేసేదట. తాను సేకరించినవి మంచివా కాదా? అని సందేహం వస్తే, ముందుగా ఆ పదార్థాలు రుచి చూసి బాగున్నవే స్వామికి నివేదించినదట. పుణ్యా:వాచన కార్యక్రమమైనా, శబరి నివేదనైనా తెలిపేది ఒక్కటే. స్వామికి ఏది నివేదించినా పరిశుద్ధమైనవే నివేదించాలి. పరిశుద్ధత వేదపూర్వకంగా, భక్తిపూర్వకంగా ఉండాలి.  

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-08

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

కర్మణ: పుణ్యా: వాచనం

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock