స్వామివారి కల్యాణ ప్రారంభంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేనులవారి పూజ జరుగుతోంది. ఇది స్మార్త సంప్రదాయంలో విఘ్ననాశకుడు విఘ్నేశునికి జరిగే పూజతో సమానం. విష్వక్సేనులవారు స్వామివారి సేనాని. స్వామియే విష్వక్సేనుడని, విష్వక్సేనుడే స్వామివారని విష్ణుసహస్రనామం చెబుతోంది.


నీరాజనం కళ్లకు అద్దుకోవడం వల్ల కళ్లకు వచ్చే జబ్బులు రాకుండా ఉంటాయి. ముఖానికి హారతి రాసుకోవడం వల్ల ముఖవర్ఛస్సు పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. స్వామివారికీ, అమ్మవారికీ పుష్పారాధనం జరుగుతోంది. నల్లనయ్యకు మల్లెపూలు సమర్పిస్తున్నారు. అయ్యవారి కల్యాణం కోసమే మల్లెలు మండుటెండల్లో పూస్తున్నాయా? దండకారణ్యంలో పూచిన ప్రతి పూవూ స్వామివారికే సొంతం. అడవిలో పూచిన పూవు, కాచిన వెన్నెలా ఎవరికి చెందుతాయి అంటే? ఇంకెవరికి చెందుతాయి? రామయ్యకే చెందుతాయి!


ఆగమానాంచ దేవానాం, నిర్గమానాంచ రాక్షసాం అంటూ శంఖ, ఘంటా నాదాలు చేస్తున్నారు. స్వామివారి నాలుగు చేతుల్లో వెనుకనున్న చేతుల్లో శంఖ చక్రములు ఉన్నాయి. ముందున్న చేతుల్లో ధనుర్బాణాలున్నాయి. కుడి చేతిలో శంఖం ఉంది. ఎడమ చేతిలో చక్రం ఉంది. ఆయుధమైన చక్రం ఎడమ చేతిలో ఎందుకుందీ అంటే? రాక్షసులను సంహరించి విజయ సూచకంగా శంఖం పూరించిన స్వామి కుడి చేతిలోకి శంఖం తీసుకున్నారని భక్తులు చెబుతారు. రాక్షసులను నాశనం చేశాను, ఇక ఉన్నదంతా శాంతే అని స్వామి చెబుతున్నారని భక్తులు అంటుంటారు. యుద్ధానికి వెళ్లేటప్పుడే కుడిచేతిలో ఆయుధం ఉండాలి, కానీ, భక్తులను అనుగ్రహించడానికి వచ్చినప్పుడు కాదు అని మరో వ్యాఖ్యానం.


భద్రాద్రిలో స్వామివారు పద్మాసనంలో ఉన్నారు. ఆయన ఎడమ ఊరువు మీద అమ్మవారు ఉన్నారు. అమ్మకు ఎడమ వైపున లక్ష్మణ స్వామి ఉన్నారు. అరణ్యాలలో ఇలాగే వెళ్లేవారట. ముందు రాముడు నడిచేవాడట. ఆయన వెనుక సీతాదేవి, ఆమె వెనుక లక్ష్మణ స్వామి వెళ్లేవారు. ఇదే అలవాటై సీతాదేవికి రక్షణగా లక్ష్మణస్వామి అమ్మకు ఎడమవైపు ఉన్నాడని మరికొందరు చమత్కరిస్తారు. అయితే, ఉత్సవమూర్తులు మాత్రం రామునికి కుడివైపు లక్ష్మణ స్వామి ఉంటే, ఎడమ వైపు సీతా దేవి ఉంటుంది.


విష్వక్సేనులవారి పూజ అయిపోయింది. ఇప్పుడు పుణ్యా: వాచనం జరుగుతోంది.  

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-07

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

విష్వక్సేన పూజ

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock