స్వామివారి కల్యాణం ప్రారంభమైంది.. ముందుగా తిరువారాధనం జరిగింది. ఉత్సవమూర్తులకు తిరువారాధనం చేయడమే కల్యాణానికి శ్రీకారం. వైష్ణవ సంప్రదాయంలో పాంచరాత్ర ఆగమనం ప్రకారం భద్రాద్రిలో కల్యాణం జరుగుతుంది. బ్రహ్మ, లక్ష్మి, ఇంద్రుడు, గరుక్మంతుడు, నారదుడు పాంచరాత్ర ఆగమనాన్ని ప్రవచించారు. ఇందులో భాగంగా మొదట నీరాజనం ఇచ్చారు. హిందూ గ్రంథాలు స్పష్టంగా నీరాజనం కళ్లకు అద్దుకోవాలని, ముఖానికి రాసుకోవాలని చెబుతున్నాయి.


తిరువారాధనం తరువాత వివాహ సంకల్పాన్ని చేస్తున్నారు. ఇది అయిన తరువాత విష్వక్సేన పూజ జరుగుతుంది. భద్రుడి శిఖరంపై నెలకొన్న భద్రగిరి వాసుని ఆలయానికి ఒక విశేషం ఉంది. ప్రపంచంలో ఏకశిలా శిఖరాలు రెండు చోట్లనే ఉన్నాయి. అవి రెండూ భారతదేశంలోనే ఉన్నాయి. వీటిలో మొదటిది తమిళనాడులోని తంజావూరులోని బృహదీశ్వరాలయం. దాని తరువాత భద్రాద్రిలోనే ఏకశిలా శిఖరం ఉంది. ఇది 36 టన్నుల బరువైన శిఖరం. ఈ శిఖరంపై సుదర్శన చక్రం ఉంది. ఇది రామదాసుకు గోదావరిలో దొరికింది.


రామదాసు తరువాత భద్రాద్రి ఆలయం తన ప్రాభవాన్ని కోల్పోయిందని చెబుతారు. ఇటువంటి తరుణంలో గుంటూరుకు చెందిన నరసింహదాసు అనే భక్తుడు ఆలయానికి సేవ చేవచేసి జీర్ణోద్ధరణ చేశారని చరిత్ర చెబుతోంది. పోకల దమ్మక్కకు కలలో కనిపించిన రాముడు కొండమీద తాను నెలకొన్నానని చెబితే, ఆమె తాటిపళ్లను నివేదిస్తూ, తాటాకుల పందిరితో రాములవారికి మొదటి ఆలయాన్ని కట్టింది. దీన్ని తలపిస్తూనా అన్నచందంగా నేడు, ప్రతి ఏడాదీ తాటాకు చలువపందిళ్లు వేసి స్వామివారి కల్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు.


దమ్మక్క సేవిస్తున్న విగ్రహాలకు రామదాసు చారిత్రక దేవాలయాన్ని గోల్కొండ ప్రభుత్వ పన్నులతో నిర్మించాడు. దీనికి ఆగ్రహించిన తానీషా రామదాసును గోల్కొండలో, ఖైదు చేసి కొరడాలతో పీడించాడని చరిత్ర చెబుతోంది. దీనికి సాక్ష్యంగా నేటికీ రామదాసు బంధిఖానా గొల్కొండలో నిలిచి ఉంది. తానీషాకు రామోజీ, లక్ష్మోజీలు మొహరీలు ఇచ్చి రామదాసును విడిపించమని ఆజ్ఞాపించారని చరిత్ర.


స్వామివారికి తిరువారాధనం ముగిసింది. రాక్షసులను వెళ్లగొట్టడానికి, దేవతలకు స్వాగతం చెప్పడానికి ఘంటా, శంఖనాదాలు చేస్తున్నారు. దీని తరువాత విష్యక్సేన పూజ ప్రారంభం అయింది.

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-06

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

తిరువారాధనం

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock