స్వామి వారు పెళ్లి పందిరిలోకి ప్రవేశించారు. మెల్లమెల్లగా కల్యాణ మండపాన్ని చేరుకున్నారు. స్వామివారితోపాటుగా ఛత్రములు వచ్చాయి. ఆలవట్టములు వచ్చాయి. దివిటీలు వచ్చాయి. వింజామరలు వచ్చాయి. మల్లెలు వచ్చాయి. కనకాంబరాలు వచ్చాయి. దివ్యాభరణాలు వచ్చాయి. కల్యాణ సమయంలో స్వామివారికి సమర్పించడానికి పట్టుపీతాంబరాలు వచ్చాయి. వీటిని అర్చక స్వాములకు అప్పగించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని తీసుకొచ్చిన వారి నుంచీ అర్చకులు స్వామివారిని భద్రంగా కల్యాణ మండపంలోకి తీసుకువెళుతున్నారు. స్వామితో దేవేరి కూడా ఉన్నది. ముందుగా, ఇద్దరూ సింహాసనంపై పక్కపక్కనే ఉన్నారు.


స్వామివారితో వచ్చిన పూజాద్రవ్యాలను వాటి అవసరాలను అనుసరించి దగ్గరగా, దూరంగా ఉంచారు. గత రాత్రి నుంచీ జాగారంలో ఉన్న భక్తులు  చైతన్యులు అయ్యారు. కల్యాణ మండపం కనిపించే అన్ని ప్రాంతాలూ భక్తులతో నిండిపోయాయి. కొందరు చెట్లు కూడా ఎక్కి చూస్తున్నారు. బహుశా ఆనాటి వానరులే మారువేషంలో మానవులుగా వచ్చి ఉంటారు. అయినా, దండకారణ్యంలో చెట్లు ఎక్కడం రాని వారు ఎవరుంటారు


కల్యాణ మండపం చుట్టూ ప్రేక్షకశాశ్వతశాలలు కట్టక పూర్వం బైరాగి మఠంలోని వారుకూడా అక్కడ నుంచే స్వామివారి కల్యాణాన్ని చూస్తుండేవారు. భద్రాచలంలో బైరాగి మఠానికి చాలా విశేషం ఉంది. రామ తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రబలమైన పాత్రను అనాదిగా పోషిస్తున్న మహనీయులు వీరు. నేల నాలుగు చెరగులా రామతత్వాన్ని ఏడాది పొడుగునా వ్యాపింపచేస్తూ దేశదిమ్మరులై తిరిగినా, రామనవమికి మాత్రం "పదవే భద్రాది పోదాం, పాపిష్టి ఘటమా!” అంటూ శరీరాన్ని తోసుకుంటూ భద్రాచలం చేరుకుంటారు. బైరాగి మఠంలో విడిది చేసి అహర్నిశం పోటీలు పడినట్లుగా బృందగానంతో రామతత్వాలు పాడుతుంటారు. భద్రాద్రి రాముడిని చూసిన తరువాత భక్తులు తప్పకుండా బైరాగి మఠం వెళ్లి కాసేపు వారి తత్వాలు విని ధన్యులు అవుతుంటారు.


స్వామివారి కల్యాణ ప్రారంభానికి ముందుగా అర్చకస్వాములు తెరకట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తెర వీడితే కానీ కల్యాణం ప్రారంభం కాదు. స్వామివారితో వచ్చిన అధికారులు, అనధికారులు, నేతలు అందరూ కల్యాణ మండపానికి ఎదురుగా నేలమీద కూర్చున్నారు. ఏనాడూ ఎండకన్నెరుగని ఎందరో తల్లులు రామచంద్రుని కల్యాణానికి వచ్చి కఠినమైన నేలపై కూర్చున్నారు. అర్చకులు. స్వామివారి కల్యాణానికి ఏర్పట్లు చేస్తున్నారు. వీరిలో కొంతమంది అయ్యవారి అర్చకులు. మరికొంతమంది అమ్మవారి అర్చకులు. 

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-05

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

కల్యాణ మండప ప్రవేశం

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock