స్వామివారు కల్యాణ మండపంలోకి ఇంకా రాలేదు. ఊరేగింపు ఇంకా మొదలు కాలేదు. కల్యాణ మండపంలో ఆరోగ్య, రక్షణ శాఖ వారు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఊరేగింపు మొదలైంది. కల్యాణ మండపం దగ్గరికి ఊరేగింపు వస్తోంది. కల్యాణ మండపంలోకి ముందుగా కొంతమంది అర్చక స్వాముల వారు ప్రవేశించారు. కల్యాణమండపంలోని సింహాసనాలతో సహా ఆ ప్రాంతం అంతా మంత్రోదకాలతో ప్రోక్షిస్తున్నారు. మెల్ల మెల్లగా కల్యాణ ద్రవ్యాలు వస్తున్నాయి. వీటిని ప్రోక్షించి అర్చకస్వాములు మండపంలోకి తీసుకు వెళుతున్నారు.


స్వామి వారు అలనాడు సిరకించెప్పక, శంఖుచక్రాలు ధరించకుండా గజేంద్రమోక్షణం కోసం వచ్చేశాడు. పాహిరామప్రభో అంటో భద్రుడు ఘోర తపస్సు చేసే సరికి, ఈసారి శంఖుచక్రాలు మరిచిపోలేదు కానీ కుడిచేతిలోది ఎడమ చేతిలో, ఎడమ చేతిలోది కుడిచేతిలో పట్టుకుని వచ్చాడు. అంతేకానీ, తీరుబడిగా, పెళ్లినడకలతో వచ్చింది మాత్రం ఎప్పుడూ లేదు. కానీ ఈఏడాది భద్రాచలంలో మాత్రం రాముడు ఆ ముచ్చట తీర్చుకుంటున్నాడు. మందీమార్బలంతో, పల్లకీ ఎక్కి దేవేరితో పాటు ఊరేగుతూ నెమ్మదిగా   కల్యాణ మండపం సమీపంలోకి వస్తున్నారు. ఇంకా పందిరిలోకి స్వామివారి ఊరేగింపు ప్రవేశించలేదు. మంగళవాయిద్య ఘోష పెరుగుతోంది. స్వామివారు స్వామివారి ఊరేగింపులో అధికారులున్నారు. అనధికారులున్నారు. రాజకీయనేతలున్నారు. రక్షకభటున్నారు. స్వామివారి దేవస్థాన సేవకులున్నారు. ముత్తైదులున్నారు. దివిటీలు పట్టేవారున్నారు. వింజామరలు పట్టే వారున్నారు. బ్యాండు మేళం వారున్నారు. చక్రవర్తి పరివారం కనుక అంగుళానికో రక్షకభటుడున్నాడు స్వామివారితో పూజాద్రవ్యాలు వస్తున్నాయి. దివ్యాభరణాలు వస్తున్నాయి. పెళ్లి సమయంలో స్వామికి సమర్పించబోయే కానుకలు పట్టుకుని కొందరు ముందు వరుసలో వస్తున్నారు. వీరిలో కొందరు ముందుగా కల్యాణ మండపం చేరుకుని తమ దగ్గరున్న ద్రవ్యాలను అర్చకస్వాములకు ఇస్తున్నారు. అర్చక స్వాములు ఆ ద్రవ్యాలను అందుకుని మంత్రోదకం ప్రోక్షిస్తూ శుద్ధి చేస్తున్నారుమంగళవాయిద్యాలు కల్యాణ మండపానికి చేరుకునే కొద్దీ భక్తులలో కోలాహలం పెరుగుతోంది.  అలనాడు మిథిలా నగరంలో ఎంతటి శోభ సంతరించుకుందో నేడు అదే శోభ భద్రాద్రిలో  నెలకొంది. దండకారణ్యంలో జరుగుతున్న స్వామివారి వివాహ వేడుకలివి. వానరులకూ, వనచరులకూ దగ్గరగా జరుగుతున్న చక్రవర్తి వివాహవేడుకలివి. అలనాటి శబరి నుంచీ, నిన్నమొన్నటి పోకల దమ్మక్క వరకూ గిరిజనతల్లుల ముద్దుబిడ్డ రామచంద్రుడు మండపానికి వచ్చేస్తున్నాడు.

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-04

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

పెళ్లినడకలతో కదలిన రాముడు 

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock