స్వామివారు ఆలయం నుంచీ ఇంకా బయల్దేరలేదు. భక్తులు పందిరిలో వేచిఉన్నారు. చతుర్భుజ రామనారాయణుడు లక్ష్మణ సమేతుడై ఊరేగింపుగా రావలసి ఉంది. ఇక్కడి రాముడు సాక్షాత్తూ రామ నారాయణుడే. భద్రుడు ఆచరిస్తున్న ఘోర తపస్సు వలన లోకాలు దహించుకు పోవడం ప్రారంభించాయి. దీంతో భద్రుడిని అనుగ్రహించడానికి స్వామి మళ్లీ రామావతారంలో దర్శనం ఇవ్వాల్సి వచ్చింది. వైకుంఠం నుంచీ నారాయణుడు రామనారాయణుడుగా చతుర్భుజాలతో దర్శనమిచ్చి, భద్రాద్రిలో నెలవున్నాడు. రామునికి తొమ్మిది రూపాలున్నాయి.


వీటిలో మొదటిది వీరరామరూపం. రెండవది సీతారామ రూపం. మూడవది షట్చక్ర సీతారాముడు. నాలుగోది దశకంఠకకులాంతక రాముడు. ఐదవది బాల రాముడు. ఈయన సంతాన ప్రదానుడు. బాలరాముని సేవిస్తే ఇంటిలో పిల్లలకు లోటుండదు. ఆరో వాడు విజయరాముడు. ఈయన విజయప్రదానుడు. సప్తమరాముడు హృష్ట రాముడు. ఈయన్ను సేవిస్తే ఆనందం కలుగుతుంది. ఎనిమిదో ఆయన కోదండరాముడు. భద్రాద్రి రాముడు కూడా దాదాపు కోదండరాముని రూపంతోనే ఉంటాడు. కానీ భద్రాద్రి రాముడు రామనారాయణుడు. నాలుగు భుజములతో ఉంటుంది. తొమ్మిదో రాముడు కవిత్వ రాముడు. ఈయన్ని సేవిస్తే కవిత్వం వస్తుంది. రామ నామంతోనే కదా, వాల్మీకి శోకం నుంచీ శ్లోకం చెప్పింది.


ఇక. భద్రాద్రి చుట్టుపక్కల ఎన్నో తీర్థములు ఉన్నాయి. కనుక, భక్తులు ఇక్కడ మూడు రోజులు ఉండి, ఈ తీర్థాలను సేవించాలని భాగవతులు చెబుతున్నారు. ఉపవాసం ఉండి, జాగారం చేసి, ఇక్కడి తీర్థాలు సేవిస్తే విశేష ఫలదాయకంగా ఉంటుంది. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే సముద్రపర్యంతం ఉన్న భూమికీ ప్రదక్షిణ చేసినట్టే. కనుకనే, ఆలయ ప్రవేశం చేసేటప్పుడు ముందుగా ప్రదక్షిణ చేయాలని పెద్దలు సూచిస్తారు. తులసీ దళాలతో రాముని సేవించిన వారు విష్ణుపదం చేరతారు.


 రాముని చూడని వాడికీ, రాముడు ఎవరిని చూడడో వారి జన్మ నిందింప దగినది అని పురాణోక్తి.  .స్వామివారి ఊరేగింపు బయల్దేర బోతోంది.  వీరంతా పెళ్లి నడకతో కల్యాణ మండపంలోకి రానున్నారు. మరికొద్దిసేపటిలో స్వామివారి ఊరేగింపు మొదలు కానుంది.

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-03

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

నవవిధరామరూపాలు

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock