భక్తులు స్వామి వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. తమలో తాము తమకున్న సందేహాలు ఇతరులకు వ్యక్తం చేస్తున్నారు. చైత్ర శుద్ధ నవమి నాడే రాముడు పుట్టాడు. మరి పుట్టిన రోజే కల్యాణం ఎలా చేస్తారు. అలనాడు రాముని కల్యాణం పుట్టిన రోజే జరిగిందా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాముడు మానవుడా? భగవంతుడా? రామునికి కల్యాణం మళ్లీ మళ్లీ ఎందుకు చేయాలి? పుట్టుకే లేని వాడు మానవుడిగా పుడితే ఏంజరుగుతుంది? రామ నామం ఎలా వచ్చింది? ఉపనిషత్తులు , పురాణాలు, భాగవతోత్తములు రాముని గురించి ఏమంటున్నారు?


రామనామతారకం సదా భజింపతగినది. రామతత్వం అతి సులభంగా అర్థమయ్యే వేదాంత విషయం. రామ అంటే చాలు ఇహపరాలు నుంచీ మోక్షం లభిస్తుంది. రాముడే జగదభిరాముడు. జగదానంద కారకుడు. పుంసామోహన రూపుడు. నల్లనివాడే కానీ ఆయన్ని మించిన అందగాడు లేడు.రాముడి పెళ్లికి భద్రాద్రి ఘనంగా ముస్తాబైంది. వీధులు తీర్చిదిద్దారు. రామపరివారం ఊరేగింపుగా తరలి వెళ్లే వీధులన్నీ రక్షక భటుల అదుపులో ఉండిపోయాయి. ఎవర్ని చూసినా పెళ్లి కళతో ఉన్నారు. ముత్తైదులు పట్టుచీరలతో తళతళలాడుతున్నారు. పచ్చని తోరణాలతో పందిరి కళకళలాడుతోంది. ఎండ పెళపెళలాడుతోంది. అదిగో గోదారి బిరబిర మంటోంది. ఆలయం విద్యుద్దీపకాంతులతో మిలమిలలాడుతోంది.


ఆలయం నుంచీ సీతారాములు కల్యాణ మండపానికి వేంచేయనున్నారు. అర్చక స్వాములు ముస్తాబు చేసిన పల్లకీ సిద్ధం చేస్తున్నారు. మంగళ వాయిద్యాల ఘోష మిన్నంటుతోంది. స్వామి రావడమే తరువాయి. ఊరేగింపు మొదలు కావడానికి తయారుగా ఉంది. ఆలయం నుంచీ బయలు దేరి స్వామివారు కల్యాణ మండపానికి రానున్నారు. మండపం దగ్గర భక్తులు స్వామివారి రాకకోసం ఎదురు చూస్తున్నారు.


ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు గత రాత్రి నుంచే కల్యాణ మండపాన్ని ఆక్రమించుకుని ఉన్నారు. స్వామి వారిని దగ్గర నుంచీ చూడాలని గతరాత్రి నుంచీ ఎదురు చూస్తున్నారు.  భద్రాచలంలో ఆకలితో ఉన్నవారు లేదు. దప్పికతో ఉన్నవారు లేరు. అనారోగ్యంతో ఉన్నవారు లేరు. ప్రభుత్వ వైద్యులు ప్రత్యేక శిబిరాలతో వేచి ఉన్నారు. తీర్థంలో ఎటువెళ్లాలో తెలియనివారు లేరు. రక్షణలేని వారు లేరు. రవాణాకు లోటులేదు. దీపకాంతులీనడానికి ఆకాశం నుంచీ తారలు రాముని సేవకు భద్రాద్రికి వచ్చాయి.

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-02

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

పుట్టిన్రోజే కల్యాణమా? 

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock