దేవదేవుని వివాహానికి అందరూ పెద్దలే. భద్రాద్రి రామ కల్యాణం జరిగిన తరువాతే భారతావనిలో ఇతర చోట్ల రామ కల్యాణం జరుగుతుంది. అన్ని చోట్లా రాముని ఆరాధిస్తారు. భద్రాచలంలో రామ నారాయణుని ఆరాధిస్తారు.  ఆయన భద్రగిరి దాశరథి. అమ్మకూ, అయ్యకూ పెళ్లి కనుక ప్రపంచంలోని రామ భక్తులు అంతా తరలి వచ్చారు. ఎవరు ఎక్కడ ఉన్నా, మనసు మాత్రం రామ కల్యాణం మీదే లగ్నం చేశారు. స్వామి వారిని ఆధునిక యంత్ర పరిజ్ఞానంతో కన్నులారా చూస్తున్నారు. చెవులారా వింటున్నారు. కన్నులున్నది స్వామిని చూడడానికే, చెవులున్నది స్వామి కల్యాణ విశేషాలు వినడానికే అన్నట్లు భక్తులు తమతమ యంత్రపరికరాలను వినియోగిస్తున్నారు.


గణపతి స్థపతి నిర్మించిన కల్యాణ మండపానికి స్వామి వారు సీతా లక్ష్మణ సమేతంగా ఇంకా దయచేయలేదు. ఆలయం నుంచి పెళ్లి నడకతో ఊరేగెంపుగా స్వామి రావలసి ఉంది. ఆయనతో కూడా అర్చక స్వాములు, అధికారులు, అనధికారులు, మంత్రాంగం, తంత్రాంగం, యంత్రాంగం, పూజాద్రవ్యాలు, దివ్యాభరణాలు, మంగళవాయిద్యాలు, ముత్తైదువలు రాలసి ఉన్నారు. కల్యాణ మండపం చుట్టూ ఉన్న వీక్షకుల మండలాలు క్రిక్కిరిసి పోయి ఉన్నాయి.


ఎక్కడ చూసినా రామ భక్తులే. ఎక్కడ విన్నా సీతారామనామ జపమే. అంతా రామ మయమే. సాధు సత్పురుషులు, దంపతులు, చిన్నపిల్లలూ, పెద్దపిల్లలూ వచ్చారు. పెళ్లి అయిన వాళ్లు పిల్లలు కలగాలని వచ్చారు. పెళ్లి కాని వాళ్లు పెళ్లి కావాలని రాముని పెళ్లి చేయించడానికి వచ్చారు. ఉద్యోగం లేని వారు ఉద్యోగం కోసం వచ్చారు. ఉద్యోగం ఉన్నవారు పదోన్నతి కోసం వచ్చారు. అధికారంలేని వారు అధికారం కోసం వచ్చారు. అధికారం ఉన్నవారు అధికారం నిలుపుకోవడం కోసం రామ కల్యాణం చేయించడానికి వచ్చారు.


పైన ప్రచండ భానుడు, కింద చెరుకు గడల వంశానికి చెందిన ఇక్ష్వాకుకుల చంద్రుడు. భద్రాచలంలో ఎక్కడ చూసినా చెరకు పానక శాలలే. మంచినీరు కాదు, ఉచితంగా పానకాలు పంచుతున్నారు. భక్తులకు ఉచితంగా ఆహారపొట్లాలు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కల్యాణం తరువాత అన్నదాన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన ఇంట్లో పెళ్లి అయితే మన ఇంట్లోనే సందడి ఉంటుంది. ఇది చక్రవర్తి కుమారుడికీ, మరో చక్రవర్తి కుమార్తెతో వివాహం కనుక భద్రగిరి మొత్తం పెళ్లి కళతో కళకళలాడుతోంది.  

మీరు చదువుతున్నారా?

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం-01

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం: స్వర్గ, బ్రహ్మలోకానందాలను మించినానందం ఏది?

 • చల్లని మాట: అచ్చమైన సుఖం ఎక్కడుంది?

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: ప్రజలపచ్చే పాలకులపచ్చ

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

అదిగో భద్రాద్రి ...  ఇదిగో గౌతమి 

వ్యాఖ్యానక్రమం ఇదే...!

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock