భద్రాద్రి శ్రీరామ కల్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యానం

స్వామివారి కల్యాణం జగత్కల్యాణం. అమ్మను పెళ్లాడే నాన్నకు బిడ్డలే పెళ్లి పెద్దలు. పిల్లలు చేసే పెద్దల పెళ్లి. .ఆయన చేసేవి మానవ బొమ్మల పెళ్లిళ్లు, మనం చేసేది ఆది దేవుడి కల్యాణం. మరో ఆది దేవుని కల్యాణం చేసే అవకాశం ఆయనకు లేదు. వ్యవహారానికి మరో ఆది దేవుడు ఉన్నా, ఆయనా ఈయనా ఒకటే కదా! వేరు వేరు అయితే, పిలిచి పెళ్లి చేయగలడు. తనను తాను ఎలా పిలుచుకుంటాడు? పెళ్లి ఎలా చేయగలడు? కనుక, కేవలం, తాను చేసిన బొమ్మలకు పెళ్లిళ్లు చేసి మురిసిపోతుంటాడు. ఎన్ని కోట్ల బొమ్మల పెళ్లిళ్లు చేసినా భగవంతుడికి మనకు కలిగే ఆనందం కలుగుతుంది? ఆయన ఆదిమధ్యాంతరహితుడే, కానీ, ఆయనకు పెళ్లి చేసే మహద్భాగ్యం మాత్రం మనదే.


యోగం లేనిదే భోగం రాదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దశాబ్దాల తరబడి సేవించడం పూర్వ జన్మ మహాసుకృతమైన మహాయోగం. తెలుగు రాజ్యాన్ని ఏలిన ముఖ్యమంత్రులు కూడా నెత్తిమీద తలబ్రాలు పట్టుకు వచ్చి, చేతులు కట్టుకుని దూరంగా కూర్చునే చోట, రామభద్రుడు చేతికందే దూరంలో ఉండి కల్యాణం జరిపించడం అంటే మహాయోగమే. పెళ్లి అంటే, భోగం. వైభోగం అంటే వివాహమే. సామాన్యుడు కూడా తన శక్తిని ప్రదర్శించేది తన ఇంట్లో జరిగే వివాహం నాడే. అటువంటిది పద్నాలుగు భువనాల చక్రవర్తి పెళ్లి అంటే ఎంతటి వైభవంగా జరుగు తుందో ఊహించడం కష్టం, కళ్లారా చూస్తేనే తెలుస్తుంది. ఇటువంటి జగత్ కల్యాణాన్ని ఒకసారి కాదు, రెండు సార్లు కాదు. మూడు దశాబ్దాలపాటు జరిపించడం నాన్న జీవితంలోనే మహారాజ యోగానికి తార్కాణం. రాముడికి కల్యాణం జరిపిం చడం, మన కోసమే. రామునికి కల్యాణం కేవలం నవమి నాడే చేయించవ లసిన అవసరం లేదు. మనకు సంతోషం కలిగి నప్పుడు కల్యాణం చేయించవచ్చు. దు:ఖం కలిగి నప్పుడు రామ కల్యాణం చేయించవచ్చు. కష్టం, నష్టం కలిగినప్పుడూ, లాభం, సౌఖ్యం కలిగినప్పుడూ భద్రాద్రి కల్యాణం జరిపించవచ్చు. మనసుకు ఆనందం కలిగితే కల్యాణం జరిపించండి. మనో మాలిన్యం కలిగితే కల్యాణం జరిపించండి. మీట నొక్కి వింటే చాలు, మీరు వద్దంటున్నా మీ మనసు స్వామి వారి కల్యాణం చేయిస్తుంది. అంత దాకా ఎందుకూ, మీకు చిత్తం వచ్చినప్పుడు సీతారామ కల్యాణం జరిపించవచ్చు. భద్రాద్రి రామ కల్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యానం వినడం కూడా స్వామికి కల్యాణం జరిపించడంతో సమానమే. ఇది మనోవాక్కాయకర్మయాగం. వెబ్ సైట్ కు రావడం, ప్రత్యక్ష వ్యాఖ్యాన అంతర్జాల అనుసంధానాల మీటలు నొక్కడం, కాయ కర్మ యాగం. ప్రత్యక్ష వ్యాఖ్యానం వాక్ రూపయాగం. వినడం మానసిక యాగం. ఈ మూడు యాగాలు మీరు చేయగలగడం, మీకు మాత్రమే కలిగిన మహాయోగం. ఇంకెందుకు ఆలస్యం ?,,,,, వెంటనే స్వామి వారికి కల్యాణ సేవ చేయండి.

కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై సంధించిన అక్షరక్షిపణి కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్ బంధువులు మారు పలుకులేకుండా పోతారు. ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని .వివరాలకు ఈ క్రింది బ్లాగును సందర్శించండి yeluripati.wordpress.com

మీరు చదువుతున్నారా?

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం

 • చల్లని మాట

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: 

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

 • కోరికలు

 • సదాచారం

 • ​ప్రజాపాలకుల కర్తవ్యం

​​

వ్యాఖ్యానక్రమం ఇదే...!

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

స్వాగతం

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి
దయచేసి ఈ క్రింది బ్లాగును సందర్శించండి
AddThis Sharing
WordPressWindows GadgetMore
Hide
Show
Share
Toggle Dock